Anam: సుపారీ దాడులు చేయించడం మాకు పెద్దపని కాదు..
ABN , First Publish Date - 2023-06-05T14:49:25+05:30 IST
నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ బ్లేడ్ బ్యాచ్ (Blade Batch)లను పంపి సుపారీ దాడులు చేయించడం తమకు పెద్దపని కాదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన సవాల్ చేశారు. ‘‘దాడులు చేయించడం కాదు జగన్... రా... యూ అండ్ మీ.. ప్లేస్.. టైం మీరే చెప్పండి.. మీరు మగాళ్లు కాదా, మగతనం లేదా? పారిపోయేది ఏమిటి? మీ తగువులు మీరు తేల్చుకోలేరా? టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లల్లో దూరాలా? మీ కార్యాలయాలపై దాడులు చేయాలా? అలాంటి సంస్కృతి మాది కాదు.. మా అధినేత చంద్రబాబు (Chandrababu) అటువంటివి ప్రోత్సహించరు’’ అని వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వస్తుందా? అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు ఎక్కువయ్యాయని, పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి... తామే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటామన్నారు. అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చామని, ఇప్పుడు కట్టడి చేయకుంటే నెల్లూరు మరో బీహార్‌గా మారుతుందని హెచ్చరించారు. తామూ దాడులు చేయగలమని, కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా అంటూ ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.