Anam Venkataramana Reddy: దానయ్య, జోకర్ అంటూ ఆయనపై సీఎం మాట్లాడటం సిగ్గుచేటు..
ABN , First Publish Date - 2023-05-12T16:49:58+05:30 IST
నెల్లూరు: ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన సాక్షి టీవీలో ప్రముఖ ఆర్ధిక విశ్లేషకునిగా ఇంటర్వ్యూ (Interview) చేయబడిన జీవీ రావు (GV Rao).. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి ఆయన్ని...
నెల్లూరు: ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన సాక్షి టీవీలో ప్రముఖ ఆర్ధిక విశ్లేషకునిగా ఇంటర్వ్యూ (Interview) చేయబడిన జీవీ రావు (GV Rao).. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి ఆయన్ని దానయ్య, జోకర్ అంటూ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ నేత (TDP Leader) ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy) ట్వీట్ (Tweet) చేశారు. ‘‘మీ సాక్షిలో స్టాక్ మార్కెట్ విశ్లేషణలాంటి ముఖ్యమైన ఇంటర్వ్యూలు కూడా దారినపోయే దానయ్యలతో, జోకర్లతో చేస్తారని ప్రజలు అర్ధం చేసుకోవచ్చా జగన్ రెడ్డి?.. ఛీ..ఛీ.. ఇంత దిగజారుడు తనం ఎప్పుడూ చూడలేదు.. ఇంత చీప్ పార్టీనా వైసీపీ.. పోయే కాలం వస్తె ఇలానే చేస్తారు.. జగన్ సర్కార్ ఏం చేసినా... తలకిందులుగా చూడాలని ఓ నిర్ణయం తీసుకున్నట్టుంది.. తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే ‘వ్యభిచారం’ అన్నట్టుగా ఉంది సాక్షి రాతల పరిస్థితి.. వాటిని రాతలు అనే బదులు.. రోతలు అంటే నయం ఏమో.. మైండ్ నిండా వైసీపీ భజనను నింపుకొని.. ప్రతిపక్షాలను హీనులుగా అభివర్ణిస్తూ… జగన్‌ను దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తున్నారు..’’ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు.