Nara Lokesh: బీటెక్ రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం
ABN , First Publish Date - 2023-11-14T23:46:15+05:30 IST
పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. బీటెక్ రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, రవికి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.
హైదరాబాద్: పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. బీటెక్ రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, రవికి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.
"బీటెక్ రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. రవికి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత. ఎన్నికల ప్రత్యర్థి బీటెక్ రవిని చూసి భయపడుతున్నాడు. జగన్ పులివెందుల వెళ్లేందుకు గజగజా వణుకుతున్నారు. నియోజకవర్గ ప్రజలను ఎదుర్కొలేని పిరికిపంద జగన్. జనాలను చూడాలంటేనే జగన్‌రెడ్డికి భయం. జగన్ తన రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు." అని లోకేష్ విమర్శించారు.