Share News

Nara Lokesh : చంద్రమోహన్ మృతి బాధాకరం

ABN , First Publish Date - 2023-11-11T11:01:20+05:30 IST

Nara Lokesh : ప్రముఖ న‌టులు చంద్రమోహ‌న్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. చంద్రమోహన్ మృతి బాధాక‌రమన్నారు.

Nara Lokesh : చంద్రమోహన్ మృతి బాధాకరం

అమరావతి : సీనియ‌ర్ న‌టులు చంద్రమోహ‌న్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. చంద్రమోహన్ మృతి బాధాక‌రమన్నారు. ‘‘హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్రమోహ‌న్ గారి మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ‌స‌భ్యుల‌కి నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-11T11:42:36+05:30 IST