Share News

Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం జగన్ ఏపీకి అవసరమా..

ABN , First Publish Date - 2023-12-09T21:21:03+05:30 IST

తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం జగన్ ఏపీకి అవసరమా..

తుని: తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. చేతగాని సీఎం అవసరమా?. వై ఏపీ నీడ్స్ జగన్?! అని లోకేష్ ప్రశ్నించారు. తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో జగన్ సర్కారు ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన చేపల దుకాణం ఇది అని విమర్శించారు. పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతకాని జగన్ రెడ్డి.. మత్స్యకారుల పొట్టగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని మండిపడ్డారు.

90 శాతం ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఫినిష్ అయ్యాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అయిదేళ్ల పుణ్యకాలమూ పూర్తైపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మకద్రోహం, అబద్ధాలు, వంచనకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్ అని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఇటువంటి చేతగాని, చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా?. వై ఏపీ నీడ్స్ జగన్?!. అని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - 2023-12-09T21:21:10+05:30 IST