-
-
Home » Andhra Pradesh » nara chandrababu naidu pititions enquiry today in supreme court and acb court
-
NCBN Enquiry: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-09-27T13:35:50+05:30 IST
ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్‌లపై సుప్రీంకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Live News & Update
-
2023-09-27T14:30:00+05:30
హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
- ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
-
2023-09-27T16:20:00+05:30
చంద్రబాబు పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
- చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై అక్టోబర్ 4కి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్
- చంద్రబాబును మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్ల పిటిషన్
-
2023-09-27T16:10:00+05:30
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో ట్విస్ట్
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేసిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా
- త్వరగా ఈ పిటిషన్‌ను లిస్ట్ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన- లూథ్రా
- మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన- లూథ్రా
- 17A అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం- లూథ్రా
- ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇది
- మేం బెయిల్ కోరుకోవడం లేదు- లూథ్రా
- జెడ్ కేటగిరి, ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా?- లూథ్రా
- ఇది పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం- లూథ్రా
- యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారు-లూథ్రా
-
2023-09-27T15:50:00+05:30
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ అక్టోబర్ 3కి వాయిదా
- సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు కేసు మెన్షన్ చేసిన సిద్ధార్థ్ లూథ్రా
- సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని జస్టిస్ ఎన్.వి ఎస్ భట్టి నాట్ బిఫోర్ మీ అన్న అంశాన్ని సీజేఐ దృష్టికి తెచ్చిన లూథ్రా
- అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సీజేఐకి వివరణ.. అక్టోబర్ 3న అన్ని వాదనలు వింటామన్న సీజేఐ
-
2023-09-27T15:21:00+05:30
ఈ రోజే విచారించేలా లూథ్రా ప్రయత్నాలు...
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను వారంపాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే (బుధవారం) విచారణకు వచ్చేలా చూడాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యాయవాది లూథ్రా వెంటనే సీజేఐ ధర్మాసనం ముందుకెళ్లారు. ఇందులో భాగంగా సీజేఐ ధర్మాసనం ముందు ఆయన వేచిచూస్తున్నారు. ఈరోజే వేరే ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ విచారించాలని సిద్ధార్థ లూథ్రా కోరనున్నారు. వేరే ధర్మాసనం కాకపోతే స్వయంగా సీజేఐ ధర్మాసనం వినాలని సిద్ధార్థ లుథ్రా అభ్యర్థించనున్నారు.
-
2023-09-27T15:05:00+05:30
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొద్దిసేపు వాయిదా
సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌పై వర్చువల్ విచారణలో పాల్గొన్న ప్రమోద్ కుమార్ దూబే
ఏసీబీ కోర్టుకు వచ్చి వెళ్లి వెళ్లిపోయిన ఏఏజీ సుధాకర్ రెడ్డి
-
2023-09-27T14:50:00+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభం
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం
- సీఐడీ తరఫున వాదనలను వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్
-
2023-09-27T14:40:00+05:30
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- వచ్చే వారానికి కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ
- నాట్ బిఫోర్ మీ అన్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి
- జస్టిస్ వెంకట నారాయణ భట్టి విముఖత చూపడంతో విచారణ వాయిదా
- సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు మరో బెంచ్‌కు బదిలీ
-
2023-09-27T14:28:00+05:30
కాసేపట్లో చంద్రబాబు SLPపై సుప్రీంలో విచారణ
- ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కాసేపట్లో చంద్రబాబు దాఖలు చేసిన SLPపై విచారణ
- న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణ
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, ప్రమోద్ కుమార్
- ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్
-
2023-09-27T14:15:00+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై టీడీపీ పవర్ పాయింట్ ప్రజంటేషన్
- ఐఆర్ఆర్ అంశంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్
- హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- ఐఆర్ఆర్ అంశంలో సొంతవారికి లబ్ది చేకూర్చారనేది తప్పు-పంచుమర్తి అనురాధ
- లింగమనేనికి అనుకూలంగా రింగ్‌రోడ్డు తయారు చేశారని ఎలా చెబుతారు?
- లేని రింగ్ రోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసింది
- హెరిటేజ్ కొన్న భూమి.. అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది- పంచుమర్తి అనురాధ
- లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి భయపడ్డారు.. అందుకే ఆయనపై అక్రమ కేసు పెట్టారు
- రాజకీయ కక్ష సాధింపుతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు- పంచుమర్తి అనురాధ
- కమిటీలో ఉన్న అధికారులను సీఐడీ ఎందుకు ప్రశ్నించట్లేదు- పంచుమర్తి అనురాధ
-
2023-09-27T14:00:00+05:30
చంద్రబాబు ఏం తప్పు చేశారో చెప్పలేకపోతున్నారు- నారా భువనేశ్వరి
- 45 ఏళ్ల నుంచి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉన్నారు- నారా భువనేశ్వరి
- యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడం తప్పా?- నారా భువనేశ్వరి
- నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొంది యువత లక్షలు సంపాదిస్తున్నారు
- ఇప్పటివరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు.. ఏం తప్పు చేశారో ఇప్పటివరకు చెప్పలేకపోయారు- నారా భువనేశ్వరి
- అందరం చేయి చేయి కలుపుదాం.. చంద్రబాబుకు అండగా నిలుద్దాం- నారా భువనేశ్వరి
-
2023-09-27T13:50:00+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మధ్యాహ్నం 2:15 గంటలకు వాదనలు
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
- చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో మధ్యాహ్నం 2:15 గంటలకు వాదనలు
-
2023-09-27T13:45:00+05:30
ఉండవల్లి పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్
- సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిల్ వేసిన ఉండవల్లి
- పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలన్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం
- విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందన్న సీజే బెంచ్
-
2023-09-27T13:35:00+05:30
మధ్యాహ్నం 2:30 గంటలకు సీఐడీ కోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం విచారణ
- చంద్రబాబును మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
- మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం
- విచారణ చేయాలని జడ్జిని కోరిన చంద్రబాబు, సీఐడీ తరఫు లాయర్లు
- చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే వాదనలు
- సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న స్పెషల్ పీపీ వివేకానంద
-
2023-09-27T13:28:00+05:30
చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టు మరోమారు పాస్ ఓవర్
- తాను ఇరుపక్షాల వాదనలు వినడానికి సిద్ధమన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
- సుప్రీంకోర్టు లో విచారణ ఈరోజు ఉన్నందున మధ్యాహ్నం వాదనలు వినాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
- ఇరుపక్షాల న్యాయవాదులు మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకున్నాక తన వద్దకు రావాలన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
- లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగే అవకాశం
- తాను సాయంత్రం 5 వరకు ఉంటానన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
-
2023-09-27T13:25:00+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు సవాల్ చేయగా.. ఈరోజు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.