Raghurama: జగన్ దంపతులకు ఇబ్బందులు తప్పవు
ABN , First Publish Date - 2023-09-16T13:23:04+05:30 IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనిపించడం లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan reddy) కళ్ళు కనిపించడం లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama krishna raju) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కేంద్రానికి రూ.40 కోట్లు జీఎస్టీ కట్టారని.. 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి కళ్ళు పెట్టి చూడాలని అన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వులతో జగన్ వేసిన రంగులు తీసేయడానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక, గ్రానైట్, మద్యంలో ఎంత తినేశారో జగన్ చెప్పాలన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్, నీతికి అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. రూ.43 వేల కోట్ల అవినీతి కేసుల్లో జగన్ ముద్దాయన్నారు. 43 వేల కోట్ల రుపాయల్లో ఛార్జిషీట్ వేసిన అవినీతి పరుడుకి, రూ.370 కోట్ల ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మధ్యన ఉన్న యుద్ధమన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu) నిజాయితీపరుడిగా బయటకు వస్తారని తెలిపారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు కొట్టి వేస్తారన్నారు. తర్వాత న్యాయస్థానంలో న్యాయం లేదని జగన్ అంటారన్నారు. కాపులను కాపులు అనడం జగన్ నేర్చుకోవాలని తెలిపారు. అజయ్ కల్లం స్టేట్మెంట్ సీబీఐ తీసుకుందని అన్నారు. ఆయన చెప్పిన అంశాలను రికార్డ్ చేశారని.. (జగన్ ) దంపతులకు ఇబ్బందులు తప్పవని ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.