MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

ABN , First Publish Date - 2023-05-20T06:48:24+05:30 IST

కడప ఎంపీ వైఎస్‌ అనినాష్‌ రెడ్డి, ఆమె తల్లి లక్ష్మమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

కర్నూలు: కడప ఎంపీ వైఎస్‌ అనినాష్‌ రెడ్డి (MP Avinash Reddy), ఆమె తల్లి లక్ష్మమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలు (Kurnool)లోని విశ్వభారతి ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్‌ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా (Anantapuram District) తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్‌ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్‌ హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లి లక్ష్మమ్మ పరిస్థితి బాగోలేకపోవడంతో కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్చించారు. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్‌ ఎంజేమ్స్‌ బాగా పెరగడం వల్ల యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుందని గుండె జబ్బు వైద్యుడు (కార్డియాలజిస్ట్‌) డాక్టర్‌ హితేష్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

వాస్తవానికి అవినాష్‌ సీబీఐ విచారణకు హైదరాబాదులోని తన ఇంటి బయలు దేరారు. అదే సమయంలో పులివెందులలో తమ స్వగృహంలోనే అవినాశ్‌ తల్లి వైఎస్‌ లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. ఆమెను సుమారు 10.10 గంటల సమయంలో పులివెందులలోనే ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్‌ సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా రూట్‌ మార్చి పులివెందులకు బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు, డోన్‌ మీదుగా గుత్తికి చేరుకున్నారు. అయితే లక్ష్మమ్మకు వివిధ పరీక్షలు చేసిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాదుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అవినాష్‌ పులివెందులకు వెళ్లలేకపోయారు. తాడిపత్రి సమీపంలోకి అంబులెన్స్‌ రాగానే అక్కడి నుంచి బయలుదేరారు. అందరు హైదరాబాద్‌కు వెళ్తారని భావించారు. కర్నూలు నగరానికి రాగానే అంబులెన్స్‌ను గాయత్రి ఎస్టేట్‌కు మళ్లించి విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించారు.

Updated Date - 2023-05-20T06:48:24+05:30 IST