Satyaprasad: జగన్‌కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ లేఖ..

ABN , First Publish Date - 2023-03-30T18:17:59+05:30 IST

సీఎం జగన్‌కు (JAGAN) టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ (Satyaprasad) లేఖ రాశారు.

Satyaprasad: జగన్‌కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ లేఖ..

అమరావతి: సీఎం జగన్‌కు (JAGAN) టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ (Satyaprasad) లేఖ రాశారు. ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరని, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోందన్నారు. ఒంటిపూట బడుల కోసం అడిగిన ఉపాధ్యాయులపై.. మంత్రి బొత్స ఆగ్రహించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ మండిపడ్డారు.

ఇటీవల తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. లక్షల్లో పెట్టుబడిన పెట్టిన రైతుల్ని వర్షాలు దెబ్బతీశాయని, నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవటం బాధాకరమన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రకాశం, బాపట్ల, తూర్పు గోదావది, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, పత్తి, మిరప పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు నీటమునిగాయని తెలిపారు. 175కు 175 సీట్లని అరవడం కాదని, కనీసం 175 మంది రైతులనైనా ఆదుకోవాలని కోరారు.

ఏటా 15 వేల ముస్లింలకు చంద్రబాబు ఫైనాన్స్‌ కార్పొరేషన్లతో లబ్ది చేకూర్చారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు వినూత్న పథకాలు పెడితే వైసీపీ తుంగలో తొక్కిందని, మైనార్టీ కార్పొరేషన్‌ను, స్కిల్ డెవలప్ సెంటర్‌లను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లల్లో 63 మంది ముస్లీంలపై దాడులు జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దర్గాలు, మసీదులు, ఖబరస్థాన్లు కట్టిస్తే.. నేడు వాటికి రక్షణలేదన్నారు. మైనార్టీలందరూ ప్రభుత్వంపై సమైక్యంగా పోరాడాలని అనగాని సత్యప్రసాద్ పిలుపిచ్చారు.

Updated Date - 2023-03-30T18:18:08+05:30 IST