Share News

Minister Appalaraju: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం.. 80% నష్టపరిహారం చెల్లిస్తాం

ABN , First Publish Date - 2023-11-20T14:46:18+05:30 IST

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు.

Minister Appalaraju: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం.. 80% నష్టపరిహారం చెల్లిస్తాం

విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో (Visakha Fishing Harbour) జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి, మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు. ప్రస్తుతం మత్స్యకారులు ఆందోళన చేపట్టింది గత ప్రభుత్వం హామీలు నెరవేర్చక ఆ భయంతో అని చెప్పుకొచ్చారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఇక్కడ అనేక సంఖ్యలో ఎక్కువ బోట్లు ఉండడమన్నారు. డామేజ్ అయినా ప్రతీ బోటు యజమానికి మత్స్యకారుడికి న్యాయం చేయమని సీఎం చెప్పారని తెలిపారు. హార్బర్‌లో ఫైర్‌ సేఫ్టీ, అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T14:46:19+05:30 IST