Karumuri Nageshwar rao: ఎన్నికలు ముందొచ్చినా.. వెనకొచ్చినా రెడీ..

ABN , First Publish Date - 2023-07-06T11:50:09+05:30 IST

ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Karumuri Nageshwar rao: ఎన్నికలు ముందొచ్చినా.. వెనకొచ్చినా రెడీ..

న్యూఢిల్లీ: ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు (Minister Karumuri Nageshwar Rao) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బీజేపీ ఎవరిని అధ్యక్షురాలిగా పెట్టుకున్న తమకు సంబంధం లేదన్నారు. మూడు పార్టీలు కలిసినా, బీఆర్ఎస్‌ కలిసినా తాము ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటన అని వెల్లడించారు. నిన్న (బుధవారం) అన్ని రాష్ట్రాల పౌర సరఫరా శాఖ మంత్రులతో సమావేశం జరిగిందని.. రూ.20 వేల కోట్ల అప్పులు చేసిందని.. వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని తెలిపారు. ఆ అప్పులన్నీ తాము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని.. వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని మంత్రి కారుమూరి నాగేశ్వరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-06T11:50:09+05:30 IST