Kurnool : విశ్వభారతి మెడికల్ కాలేజీలో MBBS విద్యార్థి ఆత్మహత్య..

ABN , First Publish Date - 2023-06-26T08:32:14+05:30 IST

కర్నూలు : జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS ) లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి చనిపోయాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు.

Kurnool : విశ్వభారతి మెడికల్ కాలేజీలో MBBS విద్యార్థి ఆత్మహత్య..

కర్నూలు : జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS ) లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి చనిపోయాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు. లోకేష్ తండ్రి బ్రహ్మానందరావుకి పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు.

లోకేష్ ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు డేటా చెక్ చేస్తున్నారు. మరోవైపు అతని మిత్రులను కూడా పోలీసులు అసలేం జరిగింది..? ఈ రెండు మూడ్రోజులుగా ఏమైనా గొడవలు జరిగాయా..? ప్రేమ విషయం.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోకేష్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. లోకేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-06-26T08:33:06+05:30 IST