AP News: దివ్యాంగురాలు సుగాలి ప్రీతి తల్లిదండ్రుల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-19T09:55:48+05:30 IST

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

AP News: దివ్యాంగురాలు సుగాలి ప్రీతి తల్లిదండ్రుల హౌస్ అరెస్ట్

కర్నూలు: సీఎం జగన్ పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు సుగాలి ప్రీతిబాయి‌కు అపాయింట్‌మెంట్ లభించలేదు. ఈ క్రమంలో దివ్యాంగురాలైన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మీకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయలేదని ప్రీతి తల్లిదండ్రులు వాపోయారు. కనీసం ముఖ్యమంత్రిని కలసి తమ గోడు వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-19T10:01:53+05:30 IST