Nandyala Dist.: శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి

ABN , First Publish Date - 2023-01-11T12:15:19+05:30 IST

నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో భారీ అవినీతి జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది.

Nandyala Dist.: శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి

నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో భారీ అవినీతి జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది. నవంబర్ నెలలో లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42 లక్షల వ్యత్యాసాలు జరిగినట్లు గమనించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి (Chairman Reddyvari Chakrapani Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ లడ్డూ తయారీ సరుకులు సెకండ్ క్వాలిటి దేవస్దానానికి సరఫరా చేస్తున్నారని, మార్కెట్ రేట్లకంటే అధికంగా దేవస్దానానికి సరుకులు ఇస్తున్నారని తమ అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు. లడ్డూ తయారీ అధిక రేట్ల సరుకుల విషయమై దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రస్తుతం దేవస్దానానికి లడ్డూ తయారీ సరుకులు ఇస్తున్న కాంట్రాక్టు రద్దు చేయాలని గత నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్‌లో బోర్డు ఆమోదం తెలిపిందని చక్రపాణిరెడ్డి తెలిపారు. కానీ ఇంతవరకు కాంట్రాక్టు రద్దు కాలేదన్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్టు రద్దు చేయలేదని ఈవో లవన్న చెప్పారన్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని స్పష్టంగా కనబడుతోందన్నారు. ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు పోల్చి చేసుకుంటే కనీసం కోటి రూపాయలు తెడా వచ్చే అవకాశం ఉందని చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-01-11T12:15:23+05:30 IST