AP NEWS: నంద్యాల జిల్లాలో బయట పడిన అమ్మవారి విగ్రహం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:43 PM
జిల్లాలోని నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయట పడింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మహనందిని దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పినట్లు తెలిపారు.
నంద్యాల జిల్లా: జిల్లాలోని నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయట పడింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మహనందిని దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పినట్లు తెలిపారు. గత రెండు రోజుల నుంచి వెతకగా సుగాలిమెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో సుగాలిమెట్ట ప్రాంతం కోలాహలంగా మారింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు, టెంకాయలు కొడుతున్నారు.