AP News: ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో రెండు సంఘాల మధ్య మాటల యుద్ధం

ABN , First Publish Date - 2023-04-26T14:24:01+05:30 IST

ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో రెండు సంఘాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.

AP News: ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో రెండు సంఘాల మధ్య మాటల యుద్ధం

విజయవాడ: ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో (AP Commercial Tax Department) రెండు సంఘాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల క్రితం అధికారులు, ప్రభుత్వంపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (Commercial Taxes Department Employees Union Chief KR Suryanarayan) తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సూర్యనారాయణ ఆరోపణలపై కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం (Association of Commercial Tax Gazetted Officers) కౌంటర్ ఇచ్చింది. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ.. సూర్యనారాయణ సావనీర్ కోసం డీలర్ల నుంచి భారీగా ఫండ్స్ వసూలు చేశారని ఆరోపించారు. సూర్యనారాయణ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సస్పెన్షన్ విషయంలో సూర్యనారాయణ హద్దు మీరి వ్యవహరించడం వల్లే ప్రభుత్వం గుర్తింపు రద్దు నోటీస్ ఇచ్చిందన్నారు. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న కమర్షియల్ ట్యాక్స్ సంఘం గుర్తింపు రద్దు చేయడం సరైందని చెప్పుకొచ్చారు. ఆఫీసుకు వెళ్లకపోయినా నిబంధనలకు విరుద్ధంగా జీతం తీసుకున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడిగా సూర్యనారాయణ వ్యవరిస్తున్నారన్నారు.

ఏపీ కమర్షియల్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. సూర్యనారాయణ తమ సంఘాన్ని అన్యాయంగా మా దగ్గర నుంచి లాక్కున్నారన్నారు. ఒక అధికారిని 6 గంటలపాటు సీటులో బంధించి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కాండక్ట్ రూల్స్‌కు వ్యతిరేకంగా సూర్యనారాయణ ధర్నా చేశారని శ్రీధర్ అన్నారు.

Updated Date - 2023-04-26T14:24:06+05:30 IST