Bharati Pravin Pawar: ఎన్టీఆర్ జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్

ABN , First Publish Date - 2023-06-06T18:42:12+05:30 IST

ఎ.కొండూరు మండలంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్

Bharati Pravin Pawar: ఎన్టీఆర్ జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్
Bharati Pravin Pawar

ఎన్టీఆర్ జిల్లా: ఎ.కొండూరు మండలంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ (Dr.Bharati Pravin Pawar) పర్యటించారు. ఏ.కొండూరు డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి కిడ్నీ బాధితుల సమస్యలు, అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం పీఎం కిసాన్ పథకంపై అక్కడే ఏర్పాటు చేసిన రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. అలాగే ఎ.కొండూరులో తాగునీటి సరఫరాపై లంబాడి తండా వాసులతో నేరుగా మాట్లాడి ఆరా తీసారు. రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న అధికారిని వివరణ కోరగా తాగునీటి ఇబ్బంది లేదు అనడంతో కేంద్ర మంత్రి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ‘మీరు జూట్ బోల్తా’... అంటూ అధికారి అంటూ తీవ్ర స్వరంతో కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను మందలించారు. ఎ.కొండూరులో డయాలసిస్ వ్యాధి గ్రస్తులు పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

Updated Date - 2023-06-06T18:42:12+05:30 IST