Share News

Vijayawada: కార్తీక దామోదరుడికి విశేష పూజలు

ABN , First Publish Date - 2023-11-27T08:04:11+05:30 IST

విజయవాడ: కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాలకు తరలి వచ్చారు. కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు. ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి.

Vijayawada: కార్తీక దామోదరుడికి విశేష పూజలు

విజయవాడ: కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాలకు తరలి వచ్చారు. కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు. ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. అర్చకులు కార్తీక దామోదరుడికి బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. పంచారామ క్షేత్రాలను, శైవ క్షేత్రాలను భక్తులు సందర్శిస్తున్నారు. నది, సముద్ర స్నానాలను ఆచరించి అరటి డొప్పల్లో కార్తీకదీపాలను వదులుతున్నారు. కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆలయాలలో 365 వొత్తులను, ఉసిరి దీపాలను వెలిగించుకొని ఉపవాసాలను ఆచరిస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు.

Updated Date - 2023-11-27T08:04:15+05:30 IST