Share News

AP Voters Alert: ఏపీ పౌరులకు బిగ్ అలర్ట్! లాస్ట్ ఛాన్స్ ఇదే

ABN , First Publish Date - 2023-12-09T15:42:07+05:30 IST

ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.

AP Voters Alert: ఏపీ పౌరులకు బిగ్ అలర్ట్! లాస్ట్ ఛాన్స్ ఇదే

ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. తర్వాత వరుసలో ఉన్న రాష్ట్ర ఏపీనే. 2024లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. రెండు, మూడు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఓటర్ జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీంతో కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవడం, ఓటును మరో ప్రాంతానికి మార్చుకోవడం, ఓటు హక్కును రద్దు చేసుకోవడం కోసం డిసెంబర్ 9వ తేదీని (శనివారం) గడువుగా పెట్టింది. 2024 జనవరి, ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్లంతా కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఈరోజే ఎన్నికల సంఘం గడువు విధించింది.

ఈ మూడింటికి ఇదే చివరి అవకాశం..

2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల కోసం ఓటర్ నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడం, మార్పు చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి వాటి కోసం డిసెంబర్ 9 (శనివారం) గడువు పెట్టింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారం-6, ఓటు మార్పు చేసుకోవాలనుకునేవారు ఫారం-8ను సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్లో అప్లై చేయాలని పేర్కొంది. ఫారం-7 ద్వారా ఓటు తొలగించే అవకాశం ఉంది. అలాగే ఫారం-6 ద్వారా ఎన్నారైలు కూడా ఆన్‌లైన్లో ఓటు నమోదు చేసుకునే ఛాన్సుంది.

ఇవి ఉండాలి..

ఓటు వివరాలు నమోదు చేసేటప్పుడు ఫొటో, వయసు ధృవీకరణ పత్రం, అడ్రస్ ఫ్రూప్, ఫోన్ నెంబర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా బీఎల్‌వోల దగ్గర కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు.

జనవరిలో ఫైనల్..

డిసెంబర్ 9వ తేదీనే ఓటర్ నమోదు, ఇతర మార్పులకు గడువు ముగించింది. అనంతరం ఈ నెల 26 వరకూ దరఖాస్తుల పరిశీలన, మార్పులు-చేర్పులు, కొత్తగా ఓటు హక్కు కల్పించే ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి 5న ఫైనల్ లిస్టును ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాజకీయ పార్టీల నుంచి వివిధ రూపాల్లో ఫిర్యాదులు రావడంతో ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈసారి రానున్న ఓట‌ర్ జాబితా ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

Updated Date - 2023-12-09T15:42:08+05:30 IST