GVLను సన్మానించిన రాధా రంగ మిత్ర మండలి, కాపు సంఘాల ప్రతినిధులు..
ABN , First Publish Date - 2023-02-16T13:02:10+05:30 IST
విజయవాడ: రాధా రంగ మిత్ర మండలి, కాపు సంఘాల ప్రతినిధులు గురువారం బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు నివాసానికి వెళ్లారు.
విజయవాడ: రాధా రంగ (Radha Ranga) మిత్ర మండలి, కాపు (Kaapu) సంఘాల ప్రతినిధులు గురువారం బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు (GVL Narasimharao) నివాసానికి వెళ్లారు. పార్లమెంటులో వంగవీటి రంగా (Vangaveeti Ranga) గురించి ప్రస్తావించిన జీవీఎల్‌ను వారు సన్మానించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీను (Chennupati Srinu) జీవియల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
గాదే బాలాజీ మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగా ప్రజల కోసం ప్రాణాలు విడిచారని, కులమతాలకు అతీతంగా అందరి మనసుల్లో నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరుతో జిల్లా పెట్టమంటే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ జీవీఎల్ పార్టమెంట్‌లో రంగా జీవితం గురించి ప్రస్తావించారన్నారు. రంగా పేరుతో జిల్లా పేరు పెట్టాల్సిన అవసరం ఉందని జీవీయల్ అడిగారని అందుకే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు.
వైసీపీలో ఉన్న కాపు నాయకులకు పదవులు కావాలి.. రంగా పేరు చెప్పుకుంటారు... ఆయన పేరు జిల్లాలకు పెట్టడానికి మాత్రం కృషి చేయరని గాదే బాలాజీ విమర్శించారు. అనేక డిమాండ్‌లు వచ్చినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదన్నారు. త్వరలోనే విజయవాడలో కాపు నాడు సమావేశం నిర్వహిస్తామన్నారు. కాపులను ఐక్యం చేసి రంగా పేరును జిల్లాకు పెట్టాలని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రంగాకు ప్రాధాన్యత తగ్గించారని ఆరోపించారు. జిల్లాకు రంగా పేరు పెట్టినవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ తీరు వల్ల కాపులంతా ఒకేమాట మీదకు వచ్చారని, అందరినీ ఐక్యం చేసిన జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.