Vijayawada: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్.. వారాహి వాహనానికి పూజలు

ABN , First Publish Date - 2023-01-25T10:56:26+05:30 IST

నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి (Varahi) వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. బుధవారం విజయవాడ దుర్గమ్మ (Durgamma) చెంత పూజలు జరిపించారు.

Vijayawada: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్.. వారాహి వాహనానికి పూజలు

విజయవాడ: నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి (Varahi) వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. బుధవారం విజయవాడ దుర్గమ్మ (Durgamma) చెంత పూజలు జరిపించారు. అనంతరం పవన్ ఇంద్రకీలాద్రి (Indrakiladri)కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు. ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌కు మంచి జరగాలని, భవిష్యత్‌లో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు.

ఇంద్రకీలాద్రిపై పవన్ కళ్యాణ్ కామెంట్లు..

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండగట్టులో చాలా బాగా దర్శనం జరిగిందని, అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు. ప్రచార రథానికి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-25T10:56:30+05:30 IST