Nara Lokesh: ఏపీ ప్రజ‌ల‌కు నారా లోకేష్ బ‌హిరంగ లేఖ‌

ABN , First Publish Date - 2023-01-25T14:37:51+05:30 IST

అమరావతి (Amaravathi): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌ రాశారు.

Nara Lokesh: ఏపీ ప్రజ‌ల‌కు నారా లోకేష్ బ‌హిరంగ లేఖ‌

అమరావతి (Amaravathi): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌ రాశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.) విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే బాదుడు పాల‌న‌లో బాధితులు కాని వారు లేరని అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేత‌లు (YCP Leaders) హ‌రించారని, రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి రాక్షస పాల‌న సాగిస్తున్నారని, ఏపీలో ప్రశ్నించే ప్రతిప‌క్షంపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి కొత్త ప‌రిశ్రమ‌లు రావ‌డంలేదని.. ఉన్నవాటిని త‌రిమేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఏపీలో వికృత రాజ‌కీయానికి వైసీపీ నేతలు తెర‌లేపారని నారా లోకేష్‌ అన్నారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, పోలీస్‌ వ్యవస్థను జ‌గ‌న్‌రెడ్డి త‌న ఫ్యాక్షన్ రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు. జగన్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అన్నివ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపైనా ఉందన్నారు. ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్న జగన్‌ సర్కార్‌ను గద్దెదింపాల్సిందేనని లోకేష్‌ పిలుపిచ్చారు.

ప్రజల తరపున ఉద్యమించాల‌ని తాను నిర్ణయించుకున్నానని, సైకో పాల‌న‌లో ఇబ్బందులు ప‌డుతున్న స‌క‌ల‌జ‌నుల గొంతుకన‌వుతానని నారా లోకేష్‌ అన్నారు.

ప్రజాస‌మ‌స్యల ప‌రిష్కారానికి, అరాచ‌క స‌ర్కార్‌తో పోరాడ‌టానికి సార‌ధిగా వ‌స్తున్నానన్నారు. యువ‌త‌కు భ‌విత‌న‌వుతా.. అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తానన్నారు. రైత‌న్నను రాజుగా చూసేవ‌ర‌కూ విశ్రమించేది లేదని, మీరే ఒక ద‌ళ‌మై, బ‌ల‌మై తన యువ‌గ‌ళం యాత్రను న‌డిపించండి అంటూ లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు.

Updated Date - 2023-01-25T14:38:01+05:30 IST