Nadendla Manohar: జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు..

ABN , First Publish Date - 2023-01-27T15:39:28+05:30 IST

అమరావతి: సీనియర్ నటి జమున (Jamuna) మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.

Nadendla Manohar: జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు..

అమరావతి: సీనియర్ నటి జమున (Jamuna) మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని జనసేన నేత నాదెండ్ల

మనోహర్ (Nadendla Manohar) అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెనాలి (Tenali) ప్రాంతంతో జమునకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆమె బాల్యం దుగ్గిరాలలోనే సాగిందన్నారు. ఆనాటి తరం నటీమణుల్లో జమునకు ప్రత్యేక స్థానం ఉందని, తెలుగింటి సత్యభామ ఆమెనని నాదెండ్ల మనోహర్ కొనియాడారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ.. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

సీనియర్ నటి జమున (86) శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ ఆరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్‌, భాగ్యరేఖ, గుండమ్మకథతోపాటు పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందించారు. 1989లో రాజమండ్రి కాంగ్రెస్‌ ఎంపీగా జమున విజయం సాధించారు.

Updated Date - 2023-01-27T15:39:32+05:30 IST