Share News

Amaravati: అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:03 AM

అమరావతి: అంగన్‌వాడీల ఉద్యమం ఏపీ రాష్ట్రంలో పతాక స్తాయికి చేరుకుంది. తమ న్యాయమైన కోర్కెల కోసం గత మూడు రోజుల నుంచి అంగన్‌వాడీలు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాద మోపుతోంది.

Amaravati: అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం

అమరావతి: అంగన్‌వాడీల ఉద్యమం ఏపీ రాష్ట్రంలో పతాక స్తాయికి చేరుకుంది. తమ న్యాయమైన కోర్కెల కోసం గత మూడు రోజుల నుంచి అంగన్‌వాడీలు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ యూనియన్ నేతలను పోలీసులు స్టేషన్‌లకు పిలిపిస్తున్నారు.

మరోవైపు మూసివేసిన అంగన్‌వాడీ సెంటర్‌లను తాళాలు బద్దలు కొట్టి తెరవాలని సచివాలయం సిబ్బంది, వాలంటీర్లకు ఆదేశాలిస్తున్నారు. గురువారం నుంచి సెంటర్లనన్నింటిని తెరవాలని ఆదేశించారు. నిన్న సాయంత్రం కొన్ని సెంటర్లను సచివాలయం సిబ్బంది తెరిచారు. అయితే తెరిచిన సెంటర్లకు మళ్లీ అంగన్‌వాడీలు తాళాలు వేశారు.

ఈ రోజు మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలియచేయాలని అంగన్‌వాడీ సంఘాలు నిర్ణయించాయి. సెంటర్లను తెరచి డ్వాక్రా సంఘాలతో ఫుడ్ తయారుచేయించి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సరుకులకు డబ్బులు ఇవ్వకుండా వంట ఎలా తయారు చేస్తామని డ్వాక్రా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా అంగన్‌వాడీల డిమాండ్‌లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు అన్ని రాజకీయ పక్షాలు, వారి అనుబంధ సంఘాలతో మాట్లాడి ఉద్యమం ఉదృతం చేయాలని అంగన్‌వాడీ సంఘాలు నిర్ణయించాయి. జగన్ ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని అడుగుతున్నామని అంగన్‌వాడీ సంఘాలు చెబుతున్నాయి.

Updated Date - Dec 14 , 2023 | 10:03 AM