Ramakrishna Condolence: సినీనటి జమున మృతిపట్ల రామకృష్ణ సంతాపం

ABN , First Publish Date - 2023-01-27T11:52:14+05:30 IST

సినీనటి, మాజీ ఎంపీ జమున మరణంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Ramakrishna Condolence: సినీనటి జమున మృతిపట్ల రామకృష్ణ సంతాపం

అమరావతి: సినీనటి, మాజీ ఎంపీ జమున మరణంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజానాట్యమండలితో జమున కళా ప్రస్థానం ప్రారంభమైందన్నారు. తెలుగు సినీ వినీలాకాశంలో అగ్ర నాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో జోడిగా నటించి జమున తనదైన ముద్రవేశారని తెలిపారు. 198 తెలుగు చిత్రాల్లో నటించిన జమున పలు హిందీ చిత్రాల్లో కూడా మెప్పించారని అన్నారు. జమున గత 25 ఏళ్లుగా తెలుగు ఆర్టిస్టులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. జమున కుటుంబ సభ్యులకు రామకృష్ణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2023-01-27T11:52:15+05:30 IST