Krishna Dist.: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి బిగ్ షాక్..

ABN , First Publish Date - 2023-04-06T11:20:24+05:30 IST

అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి బిగ్ షాక్ (Big Shock) తగిలింది. ఆ నియోజకవర్గం కీలకనేత పరుచూరి సుభాష్ చంద్ర బోస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Krishna Dist.: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి బిగ్ షాక్..

కృష్ణాజిల్లా: అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి బిగ్ షాక్ (Big Shock) తగిలింది. ఆ నియోజకవర్గం కీలకనేత పరుచూరి సుభాష్ చంద్ర బోస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు చూపు లేని ప్రభుత్వ విధానాలతో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఘంటసాల (Ghantasala), చల్లపల్లి మండలాలను (Challapally Mandals) ప్రభావితం చేయగల నేత పార్టీని వీడటంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy)తో సుభాష్ చంద్రబోస్ కలసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర (Padayatra) చేసి జగన్‌కు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా (YS Rajasekhar Reddy) జగన్ పరిపాలన చేస్తారని ఆశిస్తే మోసపు మాటలతో ప్రజలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదల బ్రతుకు భారం కావడంతో పార్టీని విడుతున్నానని ఆయన ప్రకటించారు. కాగా సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆయన అనుచరులు, 50 మంది ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్నారు.

Updated Date - 2023-04-06T11:20:24+05:30 IST