AP News : కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసుల పురోగతి
ABN , First Publish Date - 2023-08-02T13:42:27+05:30 IST
కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు.
విజయవాడ : కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు. కిడ్నీ డోనర్‌కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా.. కిడ్నీ రిసీవర్ దీపక్ రెడ్డితో మీడియేటర్ కార్తీక్ డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో బాబురావు అనే మీడియేటర్ వద్ద కార్తీక్ అసిస్టెంట్‌గా చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ముందు కార్తీక్‌ను పోలీసులు హాజరు పరుచనున్నారు.