AP News: ‘కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు’

ABN , First Publish Date - 2023-05-23T19:00:53+05:30 IST

కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.

AP News: ‘కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు’

విజయవాడ: కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు. ఎమ్మెల్యేల అవినీతిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు బీజేపీ కార్యక్రమాలు చేపడితే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ఇచ్చిన 21లక్షల ఇళ్లకు 32వేళ కోట్లు ఇస్తే 15వెలు కొట్లు మాత్రమే లెక్కలు చెప్తుందని ఆరోపించారు. 90 వేళ కోట్ల రూపాయల లేఖలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. కావలి వెళ్లాలని bjym నేతలు ప్రయత్నిస్తే పోలీసులు ఎటాక్ చేశారని అన్నారు. కావలి డీఎస్పీ కాళ్ళతో నొక్కి అడ్డుకున్నారని ఆరోపించారు. కావలి డీఎస్సీని సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

మానవ హక్కుల సంఘంతో బీసీ కమీషన్‌కు పిర్యాదు చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీనే అన్నారు. బీసీ సామాజిక చైతన్య సభలను విశాఖ, కర్నూలులో నిర్వహిస్తామని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరిస్తామన్నారు. వచ్చే నెల 16న‌ కర్నూలులో బీసీ సామాజిక సభ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే విశాఖలో ఈ నెల 28న బీసీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ బీసీలను చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ పని సీబీఐ చేస్తుందన్నారు.

Updated Date - 2023-05-23T19:00:53+05:30 IST