Share News

Kollu Ravindra : కొల్లు రవీంద్రపై పోలీసుల దురుసు ప్రవర్తన

ABN , First Publish Date - 2023-10-17T10:49:49+05:30 IST

మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిన్న ఉదయం కొల్లురవీంద్రను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి వరకూ వివిధ స్టేషన్లు తిప్పారు.

Kollu Ravindra : కొల్లు రవీంద్రపై పోలీసుల దురుసు ప్రవర్తన

అమరావతి : మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిన్న ఉదయం కొల్లురవీంద్రను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి వరకూ వివిధ స్టేషన్లు తిప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు కట్టడి చర్యలు చేపడుతున్నారు. రెండో రోజు కూడా ఉదయాన్నే కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఉదయాన్నే తన ఇంటికి ఎందుకొచ్చారని అడిగిన కొల్లురవీంద్రపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీద మీదకు వెళ్లి ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ హుకుం జారీ చేశారు. పోలీసుల తీరుపై వీడియో తీస్తున్న కొల్లు అనుచరులపై దాడికి యత్నించారు. దాడి యత్నాన్ని అడ్డుకుని ఇంటి ఆవరణలోనే కొల్లు రవీంద్ర నిరసనకు కూర్చున్నారు.

Updated Date - 2023-10-17T10:49:49+05:30 IST