TSEC: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..
ABN , First Publish Date - 2023-09-08T20:24:22+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీకాలాన్ని పొడిగించినట్లు ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సి.పార్థసారథి (C.Partha Sarathi) పదవీకాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 9-9-2020లో తెలంగాణ రాష్ట్ర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పార్థసారథి మూడేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఈ రోజుతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం సమీక్షించి మరో సంవత్సరం పాటు పదవికాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.