Dr. Atchanna కేసు... అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ

ABN , First Publish Date - 2023-03-27T13:41:40+05:30 IST

కడప జిల్లా పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మృతి వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలియజేశారు.

Dr. Atchanna కేసు... అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ

అమరావతి: కడప జిల్లా పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న (Doctor Atchanna) మృతి వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ (SP Anburajan) మీడియాకు తెలియజేశారు. డాక్టర్ అచ్చన్న అను మానస్పద మృతి కేసును పోలీసులు చేధించారని తెలిపారు. 14న డాక్టర్ అచెన్న కనిపించడం లేదని ఆయన కుమారుడు కడప 1 టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. 24న అన్నమయ్య జిల్లా (Annamaiah District) రామాపురం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని.. అది తప్పిపోయిన డాక్టర్ అచెన్న మృతదేహంగా గుర్తించామన్నారు. ఇదే శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ సర్జన్ సుభాష్ చంద్రబోస్ హతమార్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. డ్యూటీ విషయంలో శాఖాపర మైన ఇద్దరి మధ్య ఉన్న తీవ్రమై న అపార్థాలు, విభేదాలే ఈ హత్యకు కారణమని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల జీతాలు, సీఎఫ్‌ఎమ్‌సీ, ఎఫ్‌‌ఆర్‌ఎస్సీ సిస్టం నుంచి డాక్టర్ అచ్చన్న తొలగించారని విచారణలో నిందితులు తెలిపారు. ఏడీ సుభాష్ చంద్రబోస్ మరో ఇద్దరి సహాయంతో డాక్టర్ అచ్చన్న హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. 14న డాక్టర్‌ అచ్చన్నను నిందితులు కిడ్నాప్ చేసి హతమార్చారని... సీసీ కెమెరాలు, మొబైల్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. పోస్టు మార్టం, ఎఫ్‌సీఎల్ రిపోర్టు ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-27T13:41:40+05:30 IST