Kadapa Dist.: వైసీపీకి వింత అనుభవం..

ABN , First Publish Date - 2023-07-02T12:29:50+05:30 IST

కడప జిల్లా: సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోనే వైసీపీకి వింత అనుభవం ఎదురైంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డికి నిరసన సెగ తగిలింది.

Kadapa Dist.: వైసీపీకి వింత అనుభవం..

కడప జిల్లా: సీఎం జగన్ (CM Jagan) సొంత ఇలాకా కడప జిల్లా (Kadapa Dist.)లోనే వైసీపీ (YCP)కి వింత అనుభవం ఎదురైంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి (MLA Raghurami Reddy)కి నిరసన సెగ తగిలింది. బ్రహ్మంగారి మఠం మండలంలో జగనన్నసురక్ష పధకం (Jagananna Suraksha Scheme)లో భాగంగా ఆదివారం గడపగడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బ్రహ్మంగారిమఠం మండలం, నరసన్నగారిపల్లె, బసవాపురంలో సమస్యలపై ఎమ్మెల్యే రఘురామి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ‘వైసీపీకి నో ఎంట్రీ.. ఓన్లీ టీడీపీకి ఎంట్రీ’ ఓకే అంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డు దర్శనమిచ్చింది. గ్రామస్తుల నిలదీత.. నిరసనలతో ఎమ్మెల్యే రఘు రామిరెడ్డి చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

Updated Date - 2023-07-02T12:44:38+05:30 IST