Kadapa Dist.: పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-04-13T11:58:45+05:30 IST

కడప జిల్లా: పులివెందుల (Pulivendula)లో వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి వైఎస్ కుటుంబంవెంట ఉండే వేంపల్లికి చెందిన జయచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.

Kadapa Dist.: పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ

కడప జిల్లా: పులివెందుల (Pulivendula)లో వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి వైఎస్ కుటుంబం (YS Family) వెంట ఉండే వేంపల్లికి చెందిన జయచంద్రారెడ్డి (Jayachandrareddy) వైసీపీకి రాజీనామా (Resignation) చేశారు. కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని పలుమార్లు కలిసి స్థానిక సమస్యలపై విన్నవించినా ఫలితం లేదన్నారు. జగన్ (Jagan) సీఎం అయిన నాలుగేళ్ల నుంచి ఇక్కడ పరిస్థితులు తారుమరు అయ్యాయన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు చాలామంది తనలాగే అసంతృప్తిగా ఉన్నారన్నారు.

పులివెందులలో ఒకే పాలన జరుగుతోందని, తమకు జరిగిన అన్యాయంపై కార్యకర్తలు తోటి కార్యకర్తలను అడిగితే.. పలానా నాయకుడు చెబితే తాము పనులు చేస్తామని.. లేకపోతే తమపై ఒత్తిడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది సరైనదికాదని కార్యకర్తలు అందరూ సమానమేనని, అందరికీ న్యాయం చేయలన్నారు. అయినా వారు వినలేదని జయచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-13T11:58:45+05:30 IST