AP News: జగన్ సర్కార్‌‌పై జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-10T19:19:50+05:30 IST

జగన్ సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి

AP News: జగన్ సర్కార్‌‌పై జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు

శ్రీకాళహస్తి: జగన్ సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లేనని ఆరోపించారు. ఏపీలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. శాంతిభద్రతల విషయంలో చేతులు ఏత్తేశారని, చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ పనిచేయటం లేదని తప్పుబట్టారు. వైసీపీ డబ్బు సంపాదనలో బిజీగా ఉందని, వైసీపీ (YCP)ని తుదముట్టించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాయలసీమ (Rayalaseema) ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని నడ్డా స్పష్టం చేశారు.

‘‘అభివృద్ధే అజెండాగా ప్రధాని మోదీ (Prime Minister Modi) 9 ఏళ్ల పాలన కొనసాగింది. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి అసాధ్యం. ప్రధాని ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరు. ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రధాని మోదీ.. బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మళ్లించారు. దేశమంతటా అభివృద్ధి జరగాలనే విధానం వైపు.. మోదీ మొగ్గు చూపారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోంది. మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవి. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదు. దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షలు చొప్పున.. బీమా సౌకర్యం మోదీ సర్కార్ కల్పించింది. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసింది. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం’’ అని నడ్డా తెలిపారు.

Updated Date - 2023-06-10T19:19:50+05:30 IST