Jogi Ramesh : చంద్రబాబు మ్యానిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నా..

ABN , First Publish Date - 2023-05-30T13:13:54+05:30 IST

ఓ వైపు ‌సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో.. ఏ సీఎం చేయని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారని కొనియాడారు. రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాలోకి జమ చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు.

Jogi Ramesh : చంద్రబాబు మ్యానిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నా..

Tirumala : ఓ వైపు ‌సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో.. ఏ సీఎం చేయని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారని కొనియాడారు. రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాలోకి జమ చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు. 35 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు అందించి.. నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నామన్నారు.

జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో తనకు అవకాశం దక్కడం అదృష్టమన్నారు. ఎంత మంది రాక్షసులు, దుర్మార్గులు అడ్డుపడ్డినా ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సీఎం జగన్ సంపాదించారన్నారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవసరమన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నానని జగన్ పేర్కొన్నారు. 2014లో 650 హామీలతో చంద్రబాబు మ్యానిఫేస్టోను తెచ్చాడన్నారు. ఆ హామీల్లో కేవలం పది హామీలను కూడా నెరవేర్చలేక పోయారని జోగి రమేష్ పేర్కొన్నారు. సిగ్గు, మానవత్వం, విలువ, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. మురికి పట్టి మలినమైన చంద్రబాబును ప్రజలు నమ్మే స్ధితిలో లేరన్నారు. శతకోటి వాగ్దానాలు ఇచ్చినా ప్రజలు పట్టించుకోరని జోగి రమేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-30T13:13:54+05:30 IST