RaghuRama: ఆ విషయాన్ని జగన్ తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-02T20:37:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు.

RaghuRama: ఆ విషయాన్ని జగన్ తెలుసుకోవాలి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan reddy)పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ( YCP MP RaghuRamaKrishna Raju) సెటైర్లు వేశారు. ''ప్రజలకిచ్చిన మాట తప్పిన జగన్.. ప్రజాద్రోహి కాదా?'' అని రఘురామ ప్రశ్నించారు. సీఎంను ప్రజాప్రతినిధులు ప్రశ్నించవద్దా? జీ హుజూర్ అనాలా? అని ఎంపీ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే సీఎం కావచ్చునని జగన్ తెలుసుకోవాలని రఘురామ సూచించారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్‌లు ప్రభుత్వం మానేస్తే మంచిదని రఘురామ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, గతంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో తనకు వచ్చిన కష్టమే.. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)కి వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకువెళ్లాలని సూచించారు. ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లే కాకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన ఫార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాన్ని రఘురామ వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-02T21:25:26+05:30 IST