LokeshPadayatra: ఉద్యోగాలేవీ జగన్‌రెడ్డీ?: లోకేశ్

ABN , First Publish Date - 2023-03-26T21:23:50+05:30 IST

నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా, ఒక్క ఉద్యోగమైనా కల్పించావా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ (Jagan)ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

LokeshPadayatra: ఉద్యోగాలేవీ జగన్‌రెడ్డీ?: లోకేశ్

పుట్టపర్తి: నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా, ఒక్క ఉద్యోగమైనా కల్పించావా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ (Jagan)ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 51వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) జనసందోహం నడుమ సాగింది. ఓబుళదేవరచెరువు మండలంలోని పగడాలపల్లిలో యువతతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ దృష్టికి యువత పలు అంశాలు తెచ్చారు. ఆయన మాట్లాడుతూ... టీడీపీ (TDP) హయాంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు వాటి అనుబంధ సంస్థలను జగన్‌రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు తరిమేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నోరెత్తితే అక్రమ కేసులు పెట్టి, ప్రజలను వేధిస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం సహాయక రంగాల్లో ఉపాధిలేక పక్కరాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. పెట్టుబడులను తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారంతో నలిగిపోతున్నారని లోకేశ్ తెలిపారు.

ఏపీని గంజాయి కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు స్వలాభం కోసం యువతకు గంజాయి అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. దయచేసి యువత... డ్రగ్స్‌, గంజాయికి దూరంగా ఉండాలని కోరారు. దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబునాయుడు ఉమ్మడి అనంత జిల్లాకు కియ కార్ల పరిశ్రమను తీసుకొచ్చారన్నారు. ఈ పరిశ్రమ వల్ల జిల్లాలో తలసరి ఆదాయం రూ.25 వేలు పెరిగిందన్నారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా, ఒక్క ఉద్యోగమైనా కల్పించావా అని జగన్‌రెడ్డిని ప్రశ్నించారు. విశాఖలో మభ్యపెట్టేందుకు జగన్‌ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారనీ, ఏ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. బెంగళూర్‌, చెన్నై, హైదరాబాద్‌ ప్రాంతాల వైపు మనం చూడటం కాదనీ, ఆ రాష్ట్రాలే ఏపీవైపు చూసేలా చేస్తామనీ, టీడీపీకి పట్టం కట్టాలని యువతను లోకేశ్ కోరారు.

Updated Date - 2023-03-26T21:23:50+05:30 IST