వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికే: యనమల

ABN , First Publish Date - 2023-02-26T21:00:31+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan) నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికే: యనమల

అనకాపల్లి : సీఎం జగన్‌ (CM Jagan) నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) అన్నారు. విభజన తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, ఇటువంటి తరుణంలో అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టి జగన్‌ అధికారంలోకి వచ్చారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెలుగుదేశం పాలన ఎంతో అవసరమని యావత్‌ ప్రజానీకం గుర్తించిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని యనమల రామకృష్ణుడు తెలిపారు.

Updated Date - 2023-02-26T21:00:32+05:30 IST