Inter Board: ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ట్రోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ABN , First Publish Date - 2023-03-11T18:37:59+05:30 IST

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.

Inter Board: ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ట్రోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

అమరావతి: ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షల సమస్యలపై ట్రోల్‌ ఫ్రీ నం: 1800 4257635 ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 1,489 కేంద్రాల్లో 10,03,990 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని ఇంటర్ బోర్డు పేర్కొంది.

మరోవైపు.. ఇంటర్‌ విద్యార్థులను మోసగిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకో వాలని ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సాయికిరణ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బొబ్బిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థులకు ఎథిక్స్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పర్యావరణం పరీక్షను తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలన్న నిబంధనను నెపంగా చూపి యాజమాన్యాలు అధిక మొత్తంలో రికార్డు ఫీజులను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సబ్జెక్టుపై తరగతులను నిర్వహించకుండానే పరీక్ష ముందు రోజు హడావుడి చేయడం తగదన్నారు. పాత రికార్డులను విద్యార్థులకు ఇచ్చి రాయించి తీసుకోవడం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-11T18:39:20+05:30 IST