అసమర్థ సీఎం జగన్‌రెడ్డి: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2023-03-27T21:30:58+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan) అసమర్థ ముఖ్యమంత్రి అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు.

అసమర్థ సీఎం జగన్‌రెడ్డి: వంగలపూడి అనిత

విశాఖపట్నం: సీఎం జగన్‌ (CM Jagan) అసమర్థ ముఖ్యమంత్రి అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)గా చెప్పుకుంటున్నారన్నారు. సైకో జగన్‌ సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌ గంజాయి, హత్య, అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. ఒక్క సంవత్సరంలో 2.6 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందంటే ఎంత విచ్చలవిడిగా రవాణా జరుగుతుందో అర్థమవుతోందన్నారు. చివరికి పవిత్రమైన తిరుమలలో కూడా గంజాయి దొరుకుతున్న దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికే జగన్‌ ఒక్క ఛాన్స్‌ అడిగారా? అని ఆమె ప్రశ్నించారు. గంజాయి మత్తులో యువత హత్యలకు పాల్పడుతున్నారని చెబుతుంటే కనీసం సమీక్ష కూడా నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అనిత విమర్శించారు.

Updated Date - 2023-03-27T21:31:03+05:30 IST