Chandrababu: క్రైస్తవ సోదరులకు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ క్రిస్మస్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 24 , 2023 | 08:29 PM
క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: క్రైస్తవ సోదరులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం.. అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు అన్నారు.
"ప్రభువైన ఏసు క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ, సహనం ప్రతీ ఒక్కరిలో పెంపొందాలి. కరుణామయుడైన క్రీస్తు మనకు అందించిన శాంతి సందేశం సమాజానికి పంచి ప్రపంచశాంతికి దోహదపడాలి. క్రీస్తు చూపిన మార్గమైన దయ, త్యాగగుణం ప్రతీ ఒక్కరూ అలవర్చుకున్నప్పుడే జీవితం సంతోషమయం అవుతుంది. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు. దయామయుడు లోకానికి వచ్చిన పర్వదినమైన క్రిస్మస్ పండగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి" అని లోకేష్ అన్నారు.
ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు నందమూరి బాలకృష్ణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు చూపించిన సేవా మార్గంలో నడిచిన నాడు ప్రతి రోజూ ఒక వేడుకే అని, కరుణామయుదు ఏసు మార్గంలో నడుస్తూ ప్రజలందరిపట్లా కరుణ, ప్రేమతో మెలుగుదామన్నారు. క్రిస్మస్ వేడుకను ప్రజలంతా కలసికట్టుగా జరుపుకోవాలని, అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని నందమూరి బాలకృష్ణ అన్నారు.