AP News: గుంటూరు రైల్వేలో వెరైటీ మోసం

ABN , First Publish Date - 2023-05-26T10:20:14+05:30 IST

గుంటూరు జిల్లా: గుంటూరు రైల్వేలో వెరైటీ మోసం జరిగింది. కేరళలోని త్రిస్సూర్ నుంచి గుంటూరుకు పది లక్షల విలువైన యాలకులను రమ్య అనే కంపెనీ రైల్వే పార్శిల్ చేసింది. ఆ పార్శిల్ సోమవారం గుంటూరుకు చేరుకుంది.

AP News: గుంటూరు రైల్వేలో వెరైటీ మోసం

గుంటూరు జిల్లా: గుంటూరు రైల్వే (Guntur Railway)లో వెరైటీ మోసం (Variety Cheating) జరిగింది. కేరళ (Kerela)లోని త్రిస్సూర్ నుంచి గుంటూరుకు పది లక్షల విలువైన యాలకులను రమ్య (Ramya) అనే కంపెనీ (Company) రైల్వే పార్శిల్ (Railway Parcel) చేసింది. ఆ పార్శిల్ సోమవారం గుంటూరుకు చేరుకుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి.. ఫేక్ ఆధార్ (Fake Aadhaar), బాండ్స్‌లు రైల్వే అధికారులకు ఇచ్చి పది లక్షల విలువైన యాలకులను తీసుకెళ్ళారు. తర్వాత ఓరిజనల్ ఎల్‌ఆర్‌తో రమ్య కంపెనీ ప్రతినిధులు గుంటూరు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే యాలకులు తీసుకెళ్ళినట్లు రైల్వే సిబ్బంది చెప్పారు. దీంతో మోసం పోయామని గ్రహించిన రమ్య కంపెనీ ప్రతినిధులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-05-26T10:20:14+05:30 IST