CM Jagan: జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:11 AM
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుగుంట సెంటర్‌లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆడుదాం ఆంధ్ర సరే.. ఆట స్థలాలు ఎక్కడా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వ స్టేడియంలను పాడుబెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు.
గుంటూరు: సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుగుంట సెంటర్‌లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆడుదాం ఆంధ్ర సరే.. ఆట స్థలాలు ఎక్కడా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వ స్టేడియంలను పాడుబెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు. చుట్టుగుంట సెంటర్‌లో సీఎం జగన్ పర్యాటనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి గో బ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకుని నినాదాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.