AP TDP: చంద్రబాబుకు మద్దతుగా పల్నాడు జిల్లాలో మహిళలు జలదీక్ష

ABN , First Publish Date - 2023-09-28T16:31:14+05:30 IST

అనంతరం చంద్రబాబు త్వరగా విడుదల కావాలని పుట్టిపాటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత వేగుంట రాణి మాట్లాడారు. ‘‘చేయని నేరానికి చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారు.

AP TDP: చంద్రబాబుకు మద్దతుగా పల్నాడు జిల్లాలో మహిళలు జలదీక్ష

పల్నాడు: అచ్చంపేట మండలం కస్తాలలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగు మహిళలు జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదిలో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రాణి మరియు మహిళలు జల దీక్ష చేపట్టారు. అనంతరం చంద్రబాబు త్వరగా విడుదల కావాలని పుట్టిపాటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత వేగుంట రాణి మాట్లాడారు. ‘‘చేయని నేరానికి చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారు. మంత్రి రోజా అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటు. వాళ్ల కాళ్లు చెప్పులు తుడవటానికి కూడా పనికి రావు రోజా. దిగజారిన రాజకీయం చేసే మీకు పుట్టగతులు ఉండవు. జగన్ రెడ్డి.. తల్లి, చెల్లిని బయటకు పంపించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు రోజా?.’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2023-09-28T16:31:14+05:30 IST