Share News

Sugunamma: చంద్రబాబు తెలుగు ప్రజల వారసత్వ ఆస్తి

ABN , First Publish Date - 2023-10-14T13:05:30+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజల వారసత్వ ఆస్తి అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు.

Sugunamma: చంద్రబాబు తెలుగు ప్రజల వారసత్వ ఆస్తి

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) తెలుగు ప్రజల వారసత్వ ఆస్తి అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Former MLA Sugunamma) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయనను కాపాడుకోవాలసిన బాధ్యత మన అందరిదన్నారు. జగన్ (CM Jagan) ప్యాక్షన్ రాజకీయాలను తిప్పికొట్టే రోజు దగ్గర పడిందన్నారు. జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబుపై గేలిగా మాట్లాడి... వైసీపీ మరింత దిగజారిందని మండిపడ్డారు. ప్రెస్‌క్లబ్‌లోకి వీర మహిళలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు అధికారుల తీరును సుగుణమ్మ తప్పు పట్టారు. తమ దిష్టి బొమ్మల్ని కాల్చి సమయంలో మిన్నుకుండిన పోలీసులు... ప్రభుత్వ దిష్టి బొమ్మ కాల్చితే టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెట్టడం జరిగిందన్నారు. శ్రీవారి సొమ్మలో ఒక శాతం కప్పం కట్టించుకునేందుకు టీటీడీ చైర్మెన్ కరుణాకరరెడ్డి ఈ వ్యవహారం సాగిస్తున్నారని సుగుణమ్మ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-14T13:05:30+05:30 IST