Kalva Srinivasulu: ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరం

ABN , First Publish Date - 2023-09-18T14:05:41+05:30 IST

ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Kalva Srinivasulu: ఏపీ రాష్టానికి చంద్రబాబు పాలన ఒక చారిత్రక అవసరం

న్యూఢిల్లీ: ఏపీ రాష్టానికి చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) పాలన ఒక చారిత్రక అవసరమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Former Minister Kalva Srinivasulu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. జగన్ తప్పుడు కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని... కేంద్రం కూడా సర్టిఫై చేసిందన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడు కేసన్నారు. ఐటీ ఉద్యోగులు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలో చంద్రబాబు విడిచి పెట్టాలని ఆందోళన చేస్తున్నారన్నారు. పార్లమెంట్ ఆవరణలో చంద్రబాబు అరెస్ట్‌పై ధర్నా చేసినట్లు తెలిపారు. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఏపీలో చట్టం ధర్మం లేదని.. ఏపీ రాజకీయ అనుచిత ఏర్పడిందని అన్నారు. చట్టాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నామని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T14:05:41+05:30 IST