Chandrababu: అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2023-03-19T21:33:57+05:30 IST

అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, పంటలు దెబ్బతిన్న రైతులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) డిమాండ్ చేశారు.

Chandrababu: అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు: చంద్రబాబు

అమరావతి: అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, పంటలు దెబ్బతిన్న రైతులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు భరోసా కల్పించాలన్నారు. అకాల వర్షాలకు 2 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, ధాన్యం, మొక్కజొన్న, మిరప, పెసర, మినుముతో పాటు అరటి, బొప్పాయి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో ఇంటి ముందు నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిముద్ధైందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. పలు జిల్లాల్లో రూ.కోట్లు మేర మిర్చి రైతులు (Farmers) నష్టపోయారని, పంచ నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలకు మిర్చి రైతుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే నల్లితామర పురుగు ఆశించడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గగా, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసి ముద్దవుతోంది. వర్షం విడవకుండా పడుతుండటంతో తడిసిన మిర్చి పంటను ఆరబెట్టేందుకు సాధ్యం కావడం లేదు. టార్పాలిన్లు, బరకాలు కప్పుతున్నా పంట తడుస్తూనే ఉంది. దీంతో పంట నాణ్యత తగ్గి, రంగుమారి డిమాండ్‌ పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పంటలు, పశువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసి ముద్దవుతోంది.

Updated Date - 2023-03-19T21:33:57+05:30 IST