FAPTo: ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణ ప్రకటన

ABN , First Publish Date - 2023-05-30T20:08:11+05:30 IST

జూన్‌ 5 నుంచి సెప్టెంబరు 1 వరకు 8 అంచెలుగా ఉద్యమిస్తామని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

FAPTo: ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణ ప్రకటన

విజయవాడ: జూన్‌ 5 నుంచి సెప్టెంబరు 1 వరకు 8 అంచెలుగా ఉద్యమిస్తామని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో జీవో 117ని ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడుతోందన్నారు. ఈ జీవో వల్ల వేలాది ఉపాధ్యాయులను భోదనకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల సరఫరా, పలు పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాఠశాల ముఖ్యకార్యదర్శి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుదర్ధరించాలని డిమాండ్‌ చేశారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రూ.6500 కోట్ల బకాయిలు చెల్లించడంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల్ని భోదనేతర పనుల నుంచి మినహాయించాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడకపోతే ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ఫ్యాప్టో డిమాండ్స్‌

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరిన నిరోధించాలని, జీవో నంబరు 117ను రద్దు చేయాలని, బోధనేతర పనుల నుంచి ఉపాఽధ్యాయులను మినహాయించాలని, పదోన్నతులను రెగ్యులర్‌ ప్రాతిపదికన ఇవ్వాలని, సీసీఎస్‌ రద్దు చేయాలని, పీఆర్‌సీ, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, చట్టబద్ధమైన 12వ పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు 11వ పీఆర్‌సీకి అనుగుణంగా పెంచాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉద్యమ కార్యాచరణ

జూన్‌ 5 నుంచి 9 వరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు

జూన్‌ 14 నుంచి 16లో నియోజకవర్గాల స్థాయి సమావేశాలు, స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు

జూన్‌ 18 నుంచి జూలై 9 వరకు ఉమ్మడి జిల్లాల వారీ సదస్సులు

జూలై 11 సమస్యల పరిష్కారానికై ముఖ్య కార్యదర్శికి నోటీసు

జూలై 26, 27, 28 ల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు

ఆగస్ట్ 4 తాలూకా స్థాయిలో 12 గంటల ధర్నా

ఆగస్ట్ 12 జిల్లా స్థాయి ర్యాలీ, 24 గంటల ధర్నా

ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబరు 1 వరకు రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలైన శ్రీకాకుళం, అనంతరపరం, తిరుపతి నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.

Updated Date - 2023-05-30T20:08:11+05:30 IST