Delhi Liquor Scam: మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీ.. కోర్టు నింబధనలివే..

ABN , First Publish Date - 2023-02-11T18:37:08+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో అరెస్టైన.. మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy)కి 10 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది...

Delhi Liquor Scam: మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీ.. కోర్టు నింబధనలివే..

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో అరెస్టైన.. మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy)కి 10 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఈడీ కస్టడీని రాఘవ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)కి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించవచ్చని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నరేష్ కుమార్ లాకా.. మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చారు. అలాగే రాఘవరెడ్డిని ప్రతిరోజూ గంటపాటు కలిసేందుకు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా కోర్టు వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta Srinivasula Reddy) తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు తెలియవచ్చింది. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది.

బుచ్చిబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తెలంగాణ (Telangana) నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం. ఈ కేసు విచారణలో భాగంగా బుచ్చిబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ (CBI) అధికారులు కోర్టును అభ్యర్థించారు. బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి అని, సహ నిందితులతో కలిసి పలుమార్లు భేటీల్లో పాల్గొన్నారని సీబీఐ తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని, బుచ్చిబాబును జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోరింది.

కేజ్రీవాల్‌ నివాసంలోనే వ్యూహం!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట్లోనే వ్యూహరచన జరిగిందని ఈడీ స్పష్టం చేసింది. 2021 డిసెంబరు 7న కేజ్రీవాల్‌ నివాసంలోనే ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కార్యదర్శి సి.అరవింద్‌ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ప్రైవేటు సంస్థలకు 12ు మార్జిన్‌ను కేటాయించాలని, తద్వారా 6ు ముడుపులు తీసుకోవాలనే కుట్రకు బీజం పడిందని పేర్కొంది. జీవోఎం ఈ మద్యం పాలసీ ముసాయిదాను ఆమోదించే ముందు.. అందులో ఈ మేరకు ప్రతిపాదనలను చేర్చారని స్పష్టం చేసింది. ‘‘ఈ కుంభకోణానికి వ్యూహకర్త అయిన విజయ్‌ నాయర్‌ ఆప్‌లో సాధారణ కార్యకర్త కాదు. ఆయన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. విజయ్‌ నాయర్‌ తరచూ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో సమావేశాలు నిర్వహించారు.

Updated Date - 2023-02-11T18:37:09+05:30 IST