Yanamala: జగన్‌రెడ్డి సర్కార్ అంటే ప్రజలకు అసహ్యం కలుగుతోంది..

ABN , First Publish Date - 2023-01-12T13:16:02+05:30 IST

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Yanamala: జగన్‌రెడ్డి సర్కార్ అంటే ప్రజలకు అసహ్యం కలుగుతోంది..

అమరావతి (Amaravathi): జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jaganmohanreddy Govt.)పై టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnadu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ధరలను పెంచి నడ్డివిరుస్తున్న జగన్ రెడ్డి సర్కార్ అంటే ప్రజలకు అసహ్యం కలుగుతోందన్నారు. రవాణా వాహనాల పన్ను పెంపుతో ప్రజలపై ఏటా రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందని అన్నారు. టీడీపీ పాలనలో రవాణా శాఖకు 6 నెలలకు రూ.1,500 కోట్ల వరకూ ఆదాయం వచ్చేదని.. జగన్‌ రెడ్డి బాదుడుతో 6 నెలల్లో రూ.2,131 కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. బైకు నుంచి లారీ వరకు కొనుగోళ్లపై జీవిత పన్ను 6శాతం పెంచారని, దేశంలోనే అత్యధిక డీజిల్, పెట్రోల్ (Diesel, Petrol) ధరలు ఏపీ (AP) రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఇప్పటికే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు, 2 రెట్లు మద్యం ధరలు పెంచారని, 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేదలను దోచుకుంటున్నారని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Updated Date - 2023-01-12T13:16:06+05:30 IST